posted on Nov 19, 2024 4:41PM
లగచర్ల దాడి కేసులో ఎ 2గా ఉన్న సురేశ్ కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. ఈ నెల 11 నుంచి సురేశ్ పరారీలో ఉన్నాడు. అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
ఇదే కేసులో ఎ1 గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేసే క్రమంలో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగింది. గ్రామస్థులను సురేశ్ రెచ్చగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సురేశ్ కెటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. దాడికి ముందు పలుమార్లు కెటీఆర్ , పట్నం నరేందర్ రెడ్డితో సురేశ్ మాట్లాడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల సంచలనమైంది.