posted on Nov 20, 2024 4:23PM
పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అహంకారం ఆభరణంగా చేసుకుంది. ప్రత్యేక తెలంగాణాలో తొలిసారి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మాజీ పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై అక్రమకేసులు బనాయించి జైలు పాలు చేసిన సంగతి తెలిసిందే. తనను ఇబ్బందులకు గురి చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సెటైరికల్ గా మాట్లాడి అందరినీ నవ్వించారు రేవంత్ రెడ్డి.
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇవాళ వేములవాడలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.