posted on Nov 20, 2024 3:27PM
తెలంగాణలో సంచలనం సృష్టించి లగచర్ల దాడి కేసులో ప్రధాన నిందితుడైన పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టునాశ్రయించిన సంగతి తెలిసిందే. క్రింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను క్వాష్ చేయాలని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టుకు వినతి చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కొడంగల్ కోర్టు రిమాండ్ రిపోర్టు నిబంధనలకు విరుద్దం గా ఇచ్చిందని నరేందర్ రెడ్డి హైకోర్టునాశ్రయించారు. క్రింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. పోలీసులు దాఖలు చేసిన మొదటి రిమాండ్ రిపోర్ట్ లో నరేందర్ రెడ్డి పేరు లేదని రెండో రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎ 1 గా చేర్చినట్టు నరేందర్ రెడ్డి అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. ఒక ఉగ్రవాది మాదిరిగా మాజీ ఎమ్మెల్యే అయిన నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని అడ్వకేట్ కోర్టుకు తెలిపారు.