Leading News Portal in Telugu

పుష్ప 2 కు హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ 


posted on Dec 3, 2024 3:00PM

పుష్ప 2 సినిమా టికెట్ ధర పెంపుపై  తెలంగాణ హైకోర్టులో విచారణ  జరిగింది. అల్లు అర్జున్ హీరోగా , సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 టికెట్ ధరల పెంపుపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన రిలీజ్ కు తెలంగాణ హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం జరిగిన విచారణలో పుష్ప 2 సినిమాకు  హైకోర్టు పచ్చజెండా ఊపింది. టికెట్ల ధరల పెంపుపై ఓ న్యాయవాది వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. టికెట్ల ధరల పెంపు వల్ల వారం రోజుల్లో ఆదాయం సమకూర్చుకోవాలని నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు పిటిష్ నర్ పేర్కొన్నారు.   టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షో ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ మళ్లిస్తున్నారని  హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.