Leading News Portal in Telugu

యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం.. ఒకరి సజీవ దహనం | telangana bus burn in up| one| deaf| return| maha


posted on Jan 15, 2025 12:20PM

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి సజీవదహనమయ్యారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం తెలంగాణ నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఒక బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ సంఘటన మధుర వద్ద  మంగళవారం (జనవరి 13) చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంల బయటపడిన వారిని వారి వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్ర లో విషాదం చోటుచేసుకుం ది. నిర్మల్ జిల్లాకు చెందిన యాత్రికులు ఉత్తరప్రదేశ్‌కు విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదావశాత్తు వారు ప్రయాణిస్తున్న బస్సు మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అందులో ఒకరు సజీవదహనమయ్యారు. మిగతా వారిని స్వస్థలాల కు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యి.