Leading News Portal in Telugu

మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ ను అడ్డుకున్న పోలీసులు | tense at mohanbabu varsity| police| stop| manchu


posted on Jan 15, 2025 4:52PM

మంచు కుటుంబ వివాదం మరో సారి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బుధవారం (జనవరి 15) కనుమ పండుగ సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వచ్చిన మంచు మనోజ్ దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. తాను తన తాత, నానమ్మలకు నివాళులర్పించడానికి వచ్చాననీ, గొడవపడేందుకు కాదనీ మంచు మనోజ్ చెప్పినప్పటికీ పోలీసులు కోర్టు అనుమతి లేదంటూ ఆయనను యూనివర్సిటీలోనికి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

అక్కడ నుంచి నేరుగా నారా వారి పల్లెకు చేరుకుని మంత్రి లోకేష్ తో భేటీ అయ్యారు. అనంతరం అనంతరం ఎ.రంగంపేటలో జరుగుతున్న పశువుల పండగలో  పాల్గొన్నమంచు మనోజ్ దంపతులు  మరోసారి మోహన్​బాబు వర్సిటీకి వచ్చారు. వర్సిటీ ఆవరణలోని శ్రీవిద్యానికేతన్‌ వద్దకు వచ్చిన మనోజ్‌ దంపతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ వద్ద మర సారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తాతా నానమ్మలకు నివాళులు కూడా అర్పించనీయరా అంటే మంచు మనోజ్ గట్టిగా కేకలు వేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.