posted on Jan 17, 2025 8:24AM
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫిలింనగర్ లోని రిలయెన్స్ ట్రెండ్స్ లో శుక్రవారం (జనవరి 17) తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని అంచనా వేశారు. రిలయన్స్ ట్రెండ్స్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుండటం, పెద్ద ఎత్తున జనం గూమిగూడటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.