విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ! | center huge package to vizag steel plant| bailout| cabinet| approve| official
posted on Jan 17, 2025 3:28PM
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కేనని కేంద్రం విస్పష్టంగా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గింది. విశాఖ ఉక్కును నష్టాల నుంచి బయటపడేయడానికి 11 వేల 400 కోట్ల రూపాయల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతిొ తెలిసిందే. జగన్ హయాంలో కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోకపోవడమే కాకుండా, ఆ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా తన పూర్తి సహకారం అందిస్తామన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం అత్యంత కీలక భాగస్వామిగా ఉండటంతో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశక్తే లేదని విస్ఫంష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిజం చేస్తూ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11 వేల 400 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇహనో ఇప్పుడో ఈ విషయంపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.