Leading News Portal in Telugu

పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ | heavy traffic hyderabad vijayawada highway| patangi| toll| plaza


posted on Jan 17, 2025 8:47AM

సంక్రాంతి పండుగ సెలవులకు సొంత ఊర్లకు వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదన్న సంప్రదాయం కారణంగా గురువారం  (జనవరి 16)న పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు.

దీంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది.  దీంతో  విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.