రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ తో భేటీ అయిన మంచు మనోజ్ | Manchu Manoj met with the Additional Collector of Rangareddy District
posted on Jan 18, 2025 3:48PM
మంచు మోహన్ బాబు ఇంట్లో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుంది. తన కష్టార్జితమైన రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ , కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇది ఫ్యామిలీ గొడవ అనుకున్నారు. అందరూ. అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో మోహన్ బాబు జిల్లా మెజిస్టేట్ అయిన రంగారెడ్డి కలెక్టర్ కు మరో మారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ మంచు మనోజ్ కు నోటీసులు ఇవ్వడంతో శనివారం మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తో భేటీ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నట్టు వివరణ ఇచ్చుకున్నారు.