తిరుమలపై కేంద్ర హోం శాఖ నజర్ | center serious on tirupathi stampede| aditional| secratary| tour| tirumal| two
posted on Jan 18, 2025 8:35PM
ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించింది. ఈ నెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, అలాగే 13న లడ్డూ విక్రయ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటలపై టీటీడీని వివరణ కోరింది.
అలాగే ఈ ఘటనల వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సజీవ్ కుమార్ జిందాల్ ఆది, సోమ వారాల్లో (జనవరి 19, 20) తిరుమలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టీటీడీ అధికారులతో భేటీ అవుతారు. తరువాత కేంద్ర హోంశాఖకు నివేదిక ఇస్తారు. టీటీడీ పాలకమండలి పాలకమండలి వ్యవహారాల్లో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. చరిత్రలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి.