ఒడిశా-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోలు హతం | encounter in odisha chattisghar border| five| maoisys| dead
posted on Jan 21, 2025 9:49AM
ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో లోని గరియాబంద్ జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో చత్తీస్ గఢ్ కోబ్రా బలగాలు, ఒడిశా ఎస్వోజీ జవాన్లు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం (జనవరి 20) నుంచి మంగళవారం (జనవరి 22) వరకూ ఇరు పక్షాల మధ్యా హోరాహోరీగా కాల్పులు జరిగాయి.
ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోల మృతదేహాలను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.