posted on Jan 21, 2025 5:22PM
చట్టానికి అతీతులు ఎవరూ కాదు అని ఈ కేసు మరో మారు నిరూపణ అయ్యింది. నాగచైతన్య, శోభితల విషయమై ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తనను విచారణ నుంచి మినహాయించాలని వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. అయితే వేణుస్వామికి హైకోర్టు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయడంతో వేణుస్వామికి మహిళా కమిషన్ మరో మారు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి ఇవ్వాళ విచారణకు హాజరై నాగచైతన్య దంపతులపై తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వ్యక్తి గత జీవితాల్లో ఇకముందు జోక్యం చేసుకోనని వేణుస్వామి మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని చట్టాలు చెబుతున్నాయి. అంతకుముందు క్రింది కోర్టు ఇదే విషయం చెప్పినప్పటికీ వేణుస్వామి హైకోర్టునాశ్రయించి మరోమారు అభాసుపాలయ్యారు. చివరకు మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు అడిగి మరింత దిగజారిపోయారు.