ఆంధ్రప్రదేశ్ లో సిస్కో జిసిసి సెంటర్?! | sisco gcc center in ap| davos| lokesh| sisco| vice| president| meet| positive
posted on Jan 21, 2025 5:12PM
ఏపీకి సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) రానుందా? ఈ సంటర్ విశాఖ పట్నంలో ఏర్పాటు కానుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఎమ్ఎన్సీ ఐటీ సంస్క సిస్కో వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ కట్సౌదాస్ తో మంగళవారం (జనవరి 21) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిస్సో జీసీసీ అన్నివిధాల అనుకూల వాతావరణం కలిగిన విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అందుకు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైజాగ్, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో అనువైన స్థలం, ప్రతిభ కలిగిన ఐటి వృత్తినిపుణులు అందుబాటులో ఉన్నారనీ, అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్ లో పాతికశాతం మందికి పైగా తెలుగువారేనని లోకేష్ వివరించారు.
ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనరంగాల్లో నైపుణ్యాభివృద్ధి ద్వారా డీప్-టెక్ హబ్‌గా ఏపీ మారనుందని, అతిపెద్ద టాలెంట్ పూల్ ఉన్న దృష్ట్యా కంపెనీ దీర్ఘకాల వ్యూహానికి ఎపి అనువుగా ఉంటుందనీ లోకేష్ ఈ సందర్భంగా సస్కో వైస్ ప్రెసిడెంట్ కు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఆయన భారత్ లో త్వరలో 1.5 బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ తయారీ భాగస్వామిగా కాంట్రాక్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామనీ, సమర్థవంతమైన మానవవనరులు ఉన్న ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.