నక్సల్స్ రహిత భారత్ దిశగా గొప్ప ముందడుగు.. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా | great fore step towards naxalత free india| amit| shah| tweet| on| chattisghar
posted on Jan 21, 2025 11:59AM
నక్సల్స్ రహిత భారత్ లక్ష్యంతో కేంద్రం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మావోయిస్టులకు బలమైన పట్టు ఉన్న ఛత్తీస్ గఢ్ లో వారి పునాదులను పెకలించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. వరుస ఎన్ కౌంటర్లతో వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్- ఒడిశా సరిహద్దులో సోమవారం నుంచి మంగళవారం వరకూ జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై కేంద్ర హోంమంత్రి స్పందించారు.
ఛత్తీస్ గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులుకదలికలపై నిఘా ఉంచి వరుస ఎన్ కౌంటర్లతో 16 మంది నక్సల్స్ మరణించిన ఘటన భ్రదతాదళాలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. నక్సల్ రహిత భారత్ దిశగా ఇదో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్ లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా సరిహద్దులో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు సోమవారం మొదలయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకూ 16 మంది మావోలు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.