posted on Jan 23, 2025 3:47PM
శ్రీకాకుళం జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. మనిషి ఆయుష్షు ఎంత అంటే ఒక్కోరిది ఒక్కో రకంగా ఉంటుంది. అప్పారావుది కూడా అంతే. అతని ఆయుష్షు తీరిపోయిందని అందరూ అనుకున్నారు. భూమ్మీద నూకలు ఉన్న వరకే జీవితం అని మరో మారు నిరూపించారు అప్పారావు. 85 ఏళ్ల ఈ వృద్దుడు బతికుండగానే డాక్టర్లు చనిపోయినట్టు కన్ఫర్మ్ చేశారు. అంత్య క్రియలు చేద్దామని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. చుట్టాలు పక్కాలకు చెప్పుకున్నారు. ఫలానా సమయంలో అంత్య క్రియలు ఉంటాయని చెప్పుకున్నారు. అప్పారావు చనిపోయాడని చెప్పుకున్న కుటుం సభ్యులకు ఊహించని షాక్ తగిలింది. పెద్దాయన చనిపోయాడని అందరూ అనుకుంటున్న తరుణంలో అప్పారావు ఇంకాబతికే ఉన్నాడని తెలుసుకుని వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించడంతో మిగిలిన కార్యం ఎలా చేయాలి అని ఆలోచించుకుంటున్న తరుణంలో ధర్మా రావు మెల్లిగా కాళ్లు కదిపాడు. తొలుత భయపడ్డ కుటుంబ సభ్యులు మెల్లి మెల్లిగా అతని శరీరంలో జరుగుతున్న మార్పులు గమనించారు. వారం రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని అప్పారావు మళ్లీమామూలు స్థితికి వస్తాడని ఎవరూ ఊహించలేకపోయారు. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన అప్పారావు మళ్లీ మామూలు మనిషి కావడం ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు.