Leading News Portal in Telugu

హైదరాబాద్ లో సింగిల్ డిజిట్ కు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు | minimum temparatures fall single digit| hyderabad| telangana| cold


posted on Jan 23, 2025 10:31AM

తెలంగాణలో చలి పులి పంజా విసిరింది. భాగ్యనగర్ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడుతోంది.

అదే సమయంలో తెలంగాణలో సీజనల్ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. చలికి ఎక్స్ పోజ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరులో లో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాజేంద్రనగర్ లో 10.5, మెదక్ లో 10.6. రామగుండంలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.