ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా?! | harish kumar gupta to be ap new dgp| dwaraka| tirumala| rao| retire| cbn| select| 1992batch
posted on Jan 23, 2025 9:09AM
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీజీపీ ద్వారకాతిరుమల రావు పదవీ విరమణ గడువు దగ్గరపడటంతో కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు చేసిన చంద్రబాబు.. చివరికి 1992 బ్యాచ్ కీ చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వ ిబాగంగా డీజీగా పని చేస్తున్నారు. ఈ హరీష్ కుమార్ గుప్తానే గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పని చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టిన అనంతరం ప్రభుత్వం సీనియారిటీ ఆధారంగా ద్వారకాతిరుమల రావును డీజీపీగా నియమించింది. ఇప్పుడు ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను చంద్రబాబు నియమించనున్నట్లు సమాచారం.
సీనియారిటీ ప్రకారం తొలి స్థానంలో 1991 బ్యాచ్ కు చెందిన మాదిరెడ్డి మాదిరెడ్డి ప్రతాప్ తొలి స్థానంలో ఉన్నప్పటికీ ఆయన గతంలో వైసీపీ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేసిన సమయంలో వివాదాలకు కేంద్ర స్థానంగా నిలిచారు. ఆయనపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. దీంతో ఆయనను పక్కన పెట్టి సీనియారిటీ జాబితాలో రెండో స్థానంలో ఉన్న హరీష్ కుమార్ గుప్తాను చంద్రబాబు నూతన డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.