posted on Jan 24, 2025 11:44AM
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్ లో ఎపికి అత్యంత ప్రాధాన్యతన నివ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నుంచి ముఖ్యమంత్రరి నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి పట్ల చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు. నిర్మలా సీతా రామన్ తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి నేరుగా మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ నివాసానికి బయలు దేరారు. అక్కడ మర్యాదపూర్వకంగా కలిసినట్టు అధికార వర్గాలు తెలియజేశాయి.