Leading News Portal in Telugu

అక్షయ పాత్ర సంస్థలో రైస్ క్లీనింగ్ మిషన్.. ప్రారంభించిన నారా భువనేశ్వరి | nara bhuwaneswari inagurate rice cleaning machine| akshyapatra| foundation


posted on Jan 25, 2025 9:13AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ ను శుక్రవారం (జనవరి 24) సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా 30 వేల మందికి పైగా పిల్లలక ఇక్కడి నుంచే భోజనం అందుతోందని అన్నారు. అక్షయ ఫౌండేషన్ లాభాపేక్ల లేని సంస్థ అన్న ఆమో.. ఈ ఫౌండేషన్ పిల్లలలో పోషకాహార లోపం లేకుండా చేసేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వా రా, అక్షయపాత్ర పిల్లల ఆకలిని తీర్చడమే కాకుండా, వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు.  అటువంటి సంస్థను సందర్శించడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆమె బియ్యాన్ని శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు.