posted on Jan 25, 2025 4:30PM
ఆదివారం (ఈ నెల 26) నుంచి తెలంగాణలో రెండో విడత సంక్షేమ పథకాల జాతర ప్రారంభం కాబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. మొత్తం నాలుగు పథకాలు అమల్లోకి రాబోతున్నాయి. లబ్దిదారుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. గ్రామ సభల్లో చర్చించి.. ఆ తర్వాతే అర్హులైన లబ్ధిదారుల జాబితాను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది.