Leading News Portal in Telugu

29న  సెంచరీకి సిద్దమైన ఇస్రో  | ISRO ready for century on 29th


posted on Jan 27, 2025 2:45PM

ఈ నెల 29(బుధవారం) 100వ రాకెట్ ప్రయోగించడానికి ఇస్రో సిద్దమైంది. ఈ సంవత్సరం తొలి రాకెట్ కావడంతో   నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. జీఎస్ ఎల్ వి 15 రాకెట్ తో ఎన్ విఎస్ 02 నేవిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ మిషన్ ఆర్డిట్ లోకి పంపనుంది.  దశాబ్ద కాలం పాటు ఈ శాటిలైట్ తన సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహం బరువు 2, 250 కిలోగ్రాములు. ఇస్రో 1980లో తొలిశాటిలైట్  ప్రయోగించింది.