Leading News Portal in Telugu

గర్బగుడిలో డాన్స్ కేసులో  సింగర్  మధు ప్రియ అరెస్ట్ లేనట్టేనా  ? 


posted on Jan 27, 2025 11:10AM

జయ శంకర్ భూ పాలపల్లి  జిల్లా  మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం  టెంపుల్ ఇన్ చార్జి,ఈ వో మారుతీపై   వేటుపడింది. సింగర్ మధు ప్రియ గర్బగుడిలో డాన్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది.  జనవరి 20 వతేదీన సింగర్ మధు ప్రియ ఆలయ ఈవో పర్మిషన్ తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.  మధుప్రియకు ఉన్న పాపులారిటీ వల్లే ఈవో అనుమతించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆమె తప్పించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక యూ ట్యూబర్ గా తాను ఆలయ ఈవో పర్మిషన్ అడగడం వెంటనే అనుమతినివ్వడం మధు ప్రియకు అనుకూలంగా మారింది. కాళేశ్వరం టెంపుల్ ఇన్ చార్జి అయిన ఈవో మారుతీ నిర్లక్ష్యం వల్లే సింగర్ మధు ప్రియ డాన్స్ చేసినట్టు దేవాదాయ శాఖ గుర్తించింది. ఈ కారణంగానే ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఈవోను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  గతంలో సింగర్ మంగ్లీ కూడా శ్రీకాళహస్తిలో ఇదే తరహా ఫోట్ షూట్ చేసి వివాదాస్పదమైంది.  సింగర్ మధు ప్రియ అయితే శృతిమించింది. ఏకంగా గర్బ గర్బగుడి తలుపులను మూసేసి సింగర్ మధు ప్రియ డాన్స్ చేసింది. ఇప్పటికే ఆలయ పూజారిని బాధ్యుడు చేస్తూ  రామకృష్ణకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈవోను  ఏకంగా విధుల్లో నుంచి  తొలగించారు.  ఆలయ ఈవోను విధుల్లో నుంచి తొలగించడం మధు ప్రియకు సేఫ్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.. ఈ వ్యవహారంలో ఇంత వరకు మధుప్రియ స్పందించకపోవడం గమనార్హం. 

దేవాదాయ శాఖను టార్గెట్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళ చేస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఉద్యోగిసిబ్బందిపై చర్య తీసుకోవడం ప్రారంభమైంది. అయితే  మధు ప్రియపై చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ శాఖ  అయిన ఐ ఆండ్ పిఆర్ లో పని చేసే  మధు ప్రియ ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంతో సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది.