posted on Jan 30, 2025 1:06PM
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు  గుర్తు తెలియని వ్యక్తులు  గురువారం బాంబు బెదిరింపు కాల్ చేశారు. అప్రమత్తమైన భధ్రతా సిబ్బంది  తనిఖీలు చేశారు. ఇది బూటకపు కాల్ అని వారు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాద్ వాసి అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.   మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ఈ కాల్ చేసినట్టు వెల్లడైంది. బాంబు లేదని కన్ఫర్మ్ చేసుకున్న భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.