వేతన జీవులకు ఒకింత ఊరట.. రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను మినహాయింపు | exception of income tax upto 12lacks| nirmala| sitaraman
posted on Feb 1, 2025 11:32AM
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కలిగే నిర్ణయం తీసుకున్నారు. వారు ఆశించినంత కాకపోయినా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ఆదాయపనున్న పరిమితిని పెంచారు. రూ.12 లక్షల వరకూ ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. అలాగే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ. 50 వేల నుంచి లక్షకు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును రూ. 2.4లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు.
– లిథీయం బ్యాటరీలపై పన్నులు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ నిర్ణయం ఊతం ఇస్తుందనడంలో సందేహం లేదు.
– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
– నిర్మలా సీతారామన్ బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఉడాన్ పథకం ద్వారా ప్రాంతాల మధ్య కనెక్టవవిటీకి వచ్చే పదేళ్లలో దేశంలో 120 విమానాశ్రయాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
– దేశంలో 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యా కారులు, పాడి రైతులకు లబ్ధి చేకూరేలా సస్వల్పకాలిక రుణాల మంజూరును సులభతరం చేయనున్నట్లు విత్త మంత్రి ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ పథకం కింద రుణ పరిమితిని రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.