posted on Feb 1, 2025 12:54PM
పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్మలా సీతారామన్ ఒక శుభ వార్త చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపారు. సవరించిన విధంగా 30, 436.95 కోట్లకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని ప్రకటించారు.
అలాగే 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు కూడా కేంద్రం ఆమోదించిందన్నారు. ఇలా ఉండగా గత బడ్జెట్ లో కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు 12, 157 కోట్ల రూపాయలు కేటాయించగా, ఆ నిధులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.