ప్రధాన మంత్రి ధన ధాన్య యోజనతో 1.7 కోట్ల మందికి లబ్థి | nirmala sitaraman announce pradhani dhan dhany yajav| benifit| rural
posted on Feb 1, 2025 10:16AM
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తితో కేంద్ర విత్తమంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
శనివారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న ఆమె తన ప్రసంగంలో దేశంలో వెనుకబడిన ప్రాంతాలలో వ్యవసాయానికి ప్రోత్సాహం, గోదాములు, నీటిపారుదల సౌకర్యాల కల్పన, అలాగే రుణ సౌకర్య వంటి వాటి కోసం ప్రధానమంత్రి ధన ధాన్య యోజన పథకాన్ని ప్రకటించారు. దీని వల్ల 1.7 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.