Leading News Portal in Telugu

సోషల్ మీడియాలో మోనాలిసా.. నెటిజన్లు ఫిదా! | maha kumb monalisa active on social media| netizens| fidaa| for| her| post| with| alluarjun


posted on Feb 3, 2025 2:21PM

మహా కుంబమేళాలో  తళుక్కుమని ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన తేనెకళ్ల సుందరి అలియాస్ మోనాలిసా భోస్లే ఇప్పుడు సినిమా హీరోయిన్ కూడా కాబోతున్నది. రాత్రికి రాత్రి వచ్చిన పాపులారిటీతో ఉక్కిరిబిక్కిరై మహా కుంభమేళా నుంచి వెళ్లిపోయిన ఆమెను బాలీవుడ్ వదల లేదు. కళ్లుతిప్పుకోలేని అందంతో మెరిసిపోయే ఆమెను వెండి తెరకు పరిచయం చేయడానికి బాలీవుడ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్లింది. త్వరలో ఆమె నటించబోయే సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్  అయిన రేఖ పొలికలు ఒకింత ఉన్న ఆమెకు ఆమె తేనెకళ్లు ఎక్స్ట్రా ఎట్రాక్షన్ గా మారాయి. అందుకే ఆమెను బాలీవుడ్ వెతుక్కుంటూ వెళ్లి మరీ సినిమా చాన్స్ ఇచ్చింది. తన తొలి సినిమాతోనే పాపులర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కుమార్తెగా నటించే చాన్స్ కొట్టేసింది.

ఇక విషయానికి వస్తే.. మోనాలిసా ఇప్పుడు తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు ఆమెను పాపులర్ చేసిన సోషల్ మీడియానే ఆశ్రయిస్తోంది. అంతే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ కు తగినట్లుగా సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది.  తాజాగా సోమవారం ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. నెటిజనులను విపరీతంగా ఆకర్షించేసింది. ఇంతకీ ఆమె పోస్టు ఏమిటంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్పా2 సినిమా పోస్టర్ పక్కన నుంచి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోనాలిసా భోస్లే..ఆ పోస్టుకు ఇప్పుడు పోస్టర్ పక్కన ఉన్నాను .. రేపు పోస్టర్ పై ఉంటాను అన్న క్యాప్షన్ ఇచ్చింది.  సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సృష్టించిన పుష్ప సినిమా2 క్రేజ్ ను తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు మోనాలిసా భోస్లే చక్కగా వాడుకుందని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు.