posted on Feb 3, 2025 12:46PM
16వ ఆర్థిక సంఘ చైర్మన్ పనగడియతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం (ఫిబ్రవరి 3)సమావేశమయ్యారు. దాదాపు రెండుగంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఎపి ఆర్థిక పరిస్థితి, వైకాపా హాయంలో ఆర్థికంగా దివాళా తీసిన తీరుపై కూడాచర్చించారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరో లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే మార్గాలను అన్వేషించి సహకరించాలని ముఖ్యమంత్రి పనగడియను కోరారు.