posted on Feb 3, 2025 12:15PM
పార్టీ మారిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హత పిటిషన్ సుప్రీంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. బిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలైన పోచారం, సంజయ్, మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు పంపింది. విచారణరు ఈ నెల 10 కి వాయిదావేసింది.