శ్రీతేజ్ ను పరామర్శించిన నిర్మాత బన్నీ వాసు.. మరింత మెరుగైన వైద్యం కోసం ఫారిన్ కు..! | sritej to shift foriegn| sandhya| theater| stampede| better| treatment| alluarjun
posted on Feb 3, 2025 11:56AM
పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తలిసిందే. తొక్కిసలాట ఘటన జరిగి రెండు నెలలు పూర్తయ్యింది. అయినా ఇప్పటి వరకూ ఆ సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలైన శ్రీ తేజ్ ఇంకా కోలుకోలేదు. అంతే కాదు.. శ్రీ తేజ్ ఇంత వరకూ సాధారణ స్థితికి రాలేదు. మనుషులను గుర్తు పట్టడం లేదు.
ఈ రెండు నెలలలో శ్రీ తేజలో కనిపించిన పురోగతి ఆక్సిజన్ అవసరం లేకుండా ఊపిరి తీసుకోవడం మాత్రమే. మనుషులను గుర్తుపట్టడం కానీ, మాట్లాడటం కానీ లేదు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ కు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు అతడిని విదేశాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను నిర్మాత బన్నీవాసు తాజాగా పరామర్శించారు. బన్నీ వాసు అల్లు అర్జున్ కు సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే అల్లు అర్జున్ సూచన మేరకు శ్రీతేజ్ వేగంగా కోలుకునేందుకు మరింత మెరుగైన వైద్యం కోసం ఫారిన్ తరలించాలని భావిస్తున్నట్లు తెలిసింది.