హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం వశం | telugudesham wins hindupuram minicipality| chairman| ycp
posted on Feb 3, 2025 11:38AM
హిందూపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైంది. మునిసిపల్ చైర్మన్ గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. మునిసిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికలో తెలుగుదేశం విజయం సాధించింది. ఈ ఎన్నికలో తెలుగుదేశం కు 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి కేవలం 14 ఓట్లు మాత్రంమే వచ్చాయి. చేతులు ఎత్తే పద్ధతిన ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో కలుపుకుంటే తెలుగుదేశం కూటమి బలం 23. దీంతో సునాయాసంగా హిందూపురం మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలో చేరిపోయింది.
నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే కావడంతో ఈ మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలువురు వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇప్పుడు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో అలా రాజీనామా చేసిన కౌన్సిలర్లకు వైసీపీ విఫ్ జారీ చేయడంతో ఉత్కంఠ మొదలైంది. చివరకు తెలుగుదేశం పార్టీ మునిసిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది.