Leading News Portal in Telugu

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు | telangana assembly secratary notices to defection mlas| supreme


posted on Feb 4, 2025 12:21PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.  

సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ పై ఈ నెల 10న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరారు.