Leading News Portal in Telugu

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం 


posted on Feb 4, 2025 2:40PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం 

  ఈ నెల 5న(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.  ప్రచార పర్వం నిన్నటితో ముగియడంతో పోలింగ్ మిగిలింది.  ఆప్, ప్రతిపక్ష బిజెపి మధ్య హోరా హోరి పోరు జరుగనుంది.  ఎన్నికల ప్రచార అంశాల్లో కాలుష్యం,  తాగునీటి సమస్య  ప్రధాన అంశాలుగా చేరాయి. యమునా నది కాలుష్యం ఎన్నికల ప్రచారం అస్త్రంగా నిలిచింది. ఆప్, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి.   బుధవారం జరుగనున్న పోలింగ్ లో కోటి 56 లక్షల మంది ఓటేయనున్నారు.  పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ మూడోసారి దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటే 25 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న బిజెపి అధికారంలో రావాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ ఉనికి కోసం తహతహలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొన్నారు. మేనిఫెస్టోను విడుదల చేశారు.  జాతీయ స్థాయిలో అగ్రనేతలు  మల్లి ఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాందీలు ఢిల్లీ చుట్టేశారు.  బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.  ఢిల్లీలోని తెలుగువారందరూ బిజెపికే వోటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.  మోదీ నేతృత్వంలో భారత దేశం వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. బడ్జెట్ లో టెక్నాలజీ, వ్యవసాయరంగాలకు ప్రోత్సహించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఫిబ్రవరి 8న  ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.