posted on Feb 4, 2025 4:49PM
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ రాశారు. కెసీఆర్ సోదరి సకలమ్మ ఇటీవలె మృతి చెందడం పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ బిజెపి మధ్య సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పరాజయంతో బిజెపి దూరమైంది. కాంగ్రెస్ ను మట్టికరిపించడానికి బిఆర్ ఎస్ బిజెపి బీ టీం అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ తీహార్ జైల్లో ఉచలు లెక్కబెట్టింది. ఈ సమయంలోనే బిఆర్ఎస్ బిజెపి మధ్య సత్సంబంధాలు బెడిసి కొట్టాయి. బిఆర్ఎస్ ను బిజెపిలో కలిపేయాలన్న ప్రతిపాదన ఫలించలేదు. తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.