Leading News Portal in Telugu

ఇలా మొదలై అలా వాయిదా పడిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం | telangana assembly special session adjourned| cabinet| meeting


posted on Feb 4, 2025 11:26AM

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు  ఇలా ప్రారంభమై అలా వాయిదా పడ్డాయి. ప్రారంభమయ్యాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే లక్ష్యంగా మంగళవారం (ఫిబ్రవరి 4) తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సభలో ప్రవేశ పెట్టడానికి ముందు కేబినెట్ సమావేశమై ఈ నివేదికను ఆమోదించాల్సి ఉంది.

అయితే కేబినెట్ భేటీ జాప్యం కావడంతో అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభం కాగానే  కేబినెట్ భేటీ కారణంగా సమావేశాలను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ కు కోరారు.  సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రివర్గ సభ్యులందరూ కేబినెట్ భేటీలో ఉన్నారనీ అది ముగియడానికి కొంత సమయం పడుతుందనీ, అందుకే అసెంబ్లీని మధ్యాహ్నానికి వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా వేశారు.  అలాగే శాసన మండలి కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.