posted on Feb 4, 2025 9:37AM
సినీ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్ రాజు హైద్రాబాద్ లోని ఐటీ కార్యాలయానికి చేరుకుని డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్ మెంట్లు ఐటీ అధికారులకు సమర్పించారు . సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఆయన సినిమాల ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఐటీ అధికారులు దిల్ రాజుకు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. దిల్ రాజుతో బాటు టాలివుడ్ కు చెందిన కొందరు దర్శక నిర్మాతల ఇళ్లలో సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.