Leading News Portal in Telugu

ఢిల్లీ పీఠం ఆప్ దే.. కేకే సర్వే అంచనా | KK SURVEY PREDIC APP RETAIN POWER| WIN 44SEATS| BJP


posted on Feb 5, 2025 5:54PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్కు జీరో నుంచి 3 స్థానా లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స తెలిపాయి. 

 కేకే సర్వే అయితే ఢిల్లీలో  ఆప్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆ పార్టీ పోటీ చేసిన 70 స్థానాలకు గాను 44 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీ 26 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు మృగ్యమని పేర్కొంది. ఇక హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలలో ఫలితం కొంచం అటూ ఇటైనా ఆప్ కచ్చితంగా 39, బీజేపీ 22 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో ఫలితం ఫొటో ఫినిష్ ఉంటుందని కేకే సర్వే పేర్కొంది. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 51 నుంచి 50 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అధికారంలో ఉన్న ఆప్ కేవలం 10 నుంచి 19 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరిచే అవకాశాలు  లేవని అంచనా వేసింది. 

ఐ మ్యాక్ త్రీ ఎగ్జిట్ పోల్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 24 నుంచి 36 స్థానాలలోనూ, బీజేపీ 41 నుంచి  43 స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తుందని అంచనావేసింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తారని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ బీజేపీ అధికారపగ్గాలు చేపడుతుందని పేర్కొంది. న్యూస్ ఆప్టిక్స్ కూడా బీజేపీకే అధికార పగ్గాలు అందుతాయని పేర్కొంది. ఆప్టిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ కు 24 నుంచి 28, బీజేపీకి 35 నుంచి 44 కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలలోనూ గెలుస్తుందని పేర్కొంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది.  

చాణక్య స్ట్రాటజీస్‌ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది.