posted on Feb 5, 2025 9:18AM
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తరువాత గంగా పూజ, గంగా హారతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భూటాన్ రాజుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర మంత్రులు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. భూటాన్ రాజు కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాలో పాల్గొనడం గమనార్హం.