posted on Feb 7, 2025 11:32AM
ఆంధ్రప్రదేశ్ లో పీ4 అంటే పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్ షిప్ విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఏపీ సీఎస్ విజయానంద్ చెప్పారు. పీ4 విధానంపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన విజయానంద్ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.
ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే పి-4 విధానం ముఖ్య ఆశయమని పేర్కొన్నారు. సమాజంలో సంపన్నులు, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడం, పేదరికం లేని సమాజాన్ని ఆవిష్కరించడమే ఈ విధానం లక్ష్యంగా చంద్రబాబు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.