ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 24 నుంచి | andhra pradesh assembly session from febraury 24th| three| weeks| payyavula| keshav| 1st| time| full
posted on Feb 7, 2025 4:05PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సెషన్ ను మూడు వారాల పాటు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తొలి సారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.
గత ఆర్థిక సంవత్సరం అంతా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ తోనే సరిపెట్టేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత జగన్ సర్కార్ నాలుగు నెలలకు ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఆ తరువాత ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ తోనూ సరిపెట్టేసింది. ఈ సారి రాష్ట్ర విత్త మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.