బీజేపీ ఎంపీ అర్వింద్ ఆర్మీ హ్యాండిల్ ను సస్సెండ్ చేసిన ఎక్స్ | X SUSPENDS BJP MP DHARMAPURI ARVIND ARMY HANDLE| MORPHED| PHOTOS| VIDEOS| BRS| MLC
posted on Feb 7, 2025 3:53PM
బీజేపీ ఎంపీ అర్వింద్ కు ఎక్స్ భారీ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో మార్ఫ్ డ్ ఫొటోలు, వీడియోలు సోస్టు చేశారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మీ ఎక్స్ హ్యాండిల్ ను శుక్రవారం (ఫిబ్రవరి 7) సస్పెండ్ చేసింది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ వేదికగా అసభ్య పోస్టులు, ఫొటోలు పోస్టు చేస్తే ఎవరి అక్కౌంట్ నైనా సస్పెండ్ చేస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ఎక్స్ హ్యాండిల్ తాజాగా ధర్మపురి అర్వింద్ ఆర్మీ ఎక్స్ హ్యాండిల్ ను సస్పెండ్ చేసింది.