posted on Feb 7, 2025 3:35PM
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంతో సహా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. లెజండరీ యాక్టర్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుపై వస్తున్న పుస్తకం గురించి వారు మోడీకి వివరించినట్లు సమాచారం. పార్లమెంటు ఆవరణలో ఈ భేటీ జరిగింది.
ఇటీవల ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఇండియన్ సినిమాకు చేసిన సేవపై ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇందుకు అక్కినేని నాగేశ్వరరావు ప్రధాని మోడీకి కృతజ్ణతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని కుటుంబం ప్రధాని మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.