Leading News Portal in Telugu

విడదల రజినీపై అట్రాసిటీ కేసు | atracity case on vidadala rajani| chilakaluripeta| police| station| high| court


posted on Feb 8, 2025 11:03AM

సైబరాబాద్ మొక్క విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసు స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైంది. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరి పేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియా పోస్టుల విషయంలో  విడదల రజినీ ఆదేశాల మేరకు తనను వేధించారని పేర్కొంటూ తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ న పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చిలకలూరి పేట పోలీసులు విడదల రజినీపై కేసు నమోదు చేశారు.  విడదల రజినీతో పాటు    ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు అయ్యింది.  

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకూ విడదల రజినీ, ఆమె పీఏలు, దొడ్డారామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణ తనను హింసించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు.  2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారనీ,  అప్పట్లో దీనిపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పిల్లి  తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై   రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.