EBM News Telugu

మోదీ గురించి ప్రకాశ్‌రాజ్ కామెంట్స్.. వైరల్‌గా మారిన ట్వీట్!

7,395

ఇప్పటికే ప‌లుసార్లు కేంద్ర ప్రభుత్వంపై విమ‌ర్శలు చేసిన సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్.. తాజాగా మరో వివాదాస్పద ట్వీట్‌తో వార్తల్లోకెక్కారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ప్రకాశ్‌రాజ్ స్పందించారు. కేజ్రీవాల్‌, ఇతర మంత్రులు కలిసి లెఫ్టి‌నెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..కొన్ని రోజులుగా ఆయన భవనంలో ధర్నా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాల్లేవ్. అయితే ఈ నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ తాజాగా మోదీపై మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

యోగా ఫిట్ నెస్ చాలెంజ్ లతో మోదీ బిజీగా ఉన్నారని.. అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అధికారులు సహకరించాలని సూచించాలని మోదీకి చురకలంటించారు. ‘ప్రియమైన సుప్రీం లీడర్‌.. మీరు మీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌, యోగా, కసరత్తులతో బిజీగా ఉన్నారని తెలుసు. ఒక్క క్షణం పాటు ఊపిరి పీల్చుకుని చుట్టూ చూడండి. మంచి పని కోసం ధర్నా చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయాలని అధికారులకు ఆదేశాలివ్వండి. మీరు కూడా మీ డ్యూటీ చేయండి’ అంటూ ప్రకాశ్ రాజ్ చమత్కార ధోరణితో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.