Leading News Portal in Telugu

IND vs WI: సూర్య ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం.. సిరీస్‌ ఆశలు సజీవం – Telugu News | IND vs WI: Suryakumar Yadav’s 83 powers India to a 7 wicket victory over West Indies In 3rd T20I Telugu Cricket News


టీ20 వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ మళ్లీ చెలరేగాడు. తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. దీంతో విండీస్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కరేబియన్‌ జట్టు విధించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), శుభ్‌మన్ గిల్‌ (6) త్వరగా అవుటైనా సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 భారీ సిక్స్‌ల సహాయంతో 83 పరుగులు చేశాడు

టీ20 వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ మళ్లీ చెలరేగాడు. తనదైన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. దీంతో విండీస్‌తో జరిగిన చావో రేవో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కరేబియన్‌ జట్టు విధించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత జట్టు 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), శుభ్‌మన్ గిల్‌ (6) త్వరగా అవుటైనా సూర్యకుమార్‌ యాదవ్‌ చెలరేగి ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 భారీ సిక్స్‌ల సహాయంతో 83 పరుగులు చేశాడు. అతనికి తోడు హైదరాబాదీ ప్లేయర్‌ తిలక్‌ వర్మ (37 బంతుల్లో 49, 4 ఫోర్లు, సిక్స్‌) నిలకడగా ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. సూర్య ఔటైనా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 20 ఒక ఫోర్‌, సిక్స్‌) మ్యాచ్‌ను ముగించాడు తిలక్‌ వర్మ. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది టీమిండియా. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 159 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌(42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లతో రాణించగా, అక్షర్‌, ముఖేష్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి

ఓపెనింగ్ పెయిర్ మళ్లీ ఫ్లాప్ 

టీమ్ ఇండియాకు గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా బ్యాటింగ్ ఆరంభం సరిగా లేదు. అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ తొలి ఓవర్‌లో రెండు బంతులు మాత్రమే ఆడిన తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే, సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి మొదటి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టాడు. గత వైఫల్యాల లెక్కను  సూర్య సెటిల్ చేశాడు. అయితే  శుభమాన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు.  ఐదో ఓవర్‌లో ఔటయ్యాడు. అయితే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నుంచి జట్టును తన బలమైన బ్యాటింగ్‌తో హ్యాండిల్ చేస్తున్న తిలక్.. సూర్యతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సమయంలో, సూర్య 23 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.   వీరిద్దరి మధ్య 87 పరుగుల భాగస్వామ్యం భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది.