Leading News Portal in Telugu

India vs Pakistan: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. వందేమాతరం, మా తుఝే సలామ్‌ నినాదాలతో హోరెత్తిన స్టేడియం – Telugu News | ACT Hockey 2023: India knock out Pakistan with 4 0 win, Book semifinal date with Japan Telugu Sports News


ఆసియా ఛాంపియన్‌షిప్ ట్రోఫీ- 2023 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 4-0తో విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంతో గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. అదే సమయంలో భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో స్థానంలో నిలిచిన జపాన్ టాప్-4కి చేరుకుంది..

క్రికెట్ మైదానంలో భారత్-పాక్ మధ్య పోరుకు కౌంట్ డౌన్ మొదలైంది. రెండు జట్లు ఆసియాకప్‌లో తలపడనున్నాయి, ఆపై ప్రపంచకప్‌లో కూడా తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, అంతకుముందే పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. అయితే అది క్రికెట్‌లో కాదు.. హాకీలో. ఆసియా ఛాంపియన్‌షిప్ ట్రోఫీ- 2023 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 4-0తో విజయం సాధించింది టీమిండియా. ఈ విజయంతో గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. అదే సమయంలో భారత్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో స్థానంలో నిలిచిన జపాన్ టాప్-4కి చేరుకుంది. ఇప్పుడు సెమీస్‌లో భారత్‌ జపాన్‌తో తలపడనుంది. కాగా రెండో సెమీఫైనల్ మలేషియా-దక్షిణ కొరియా మధ్య జరగనుంది. బుధవారం రాత్రి జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి . పోటీ హోరాహోరీగా ఉంటుందని అనుకున్నారు చాలామంది. అందుకు తగ్గట్టే మ్యాచ్ ప్రారంభంలో పాక్ జట్టు తన దూకుడును ప్రదర్శించింది. అయితే భారత్ ఆటగాళ్ల ఎదురుదాడి ముందు పాక్ దూకుడు కాస్త చల్లబడింది. ఏ దశలోనూ పాకిస్తాన్‌కు అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడారు. దీంతో 4-0 తేడాతో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్‌.

జైషా, అనురాగ్ ఠాకూర్ ల అభినందనలు..

చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన 2 నిమిషాల్లోనే పాక్ జట్టు గోల్ కొట్టినట్లు భావించినా, భారత్ రివ్యూ తీసుకుంది. దీంతో పాకిస్థాన్ ఖాతాలో గోల్ చేరలేదు. దీని తర్వాత, భారత్ అద్భుతమైన ఆట ఆడింది. మొదటి క్వార్టర్ ముగియడానికి కొన్ని సెకన్లు మిగిలి ఉండగానే, హర్మన్‌ప్రీత్ సింగ్ మొదటి గోల్ చేశాడు. రెండో గోల్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో జుగ్‌రాజ్ సింగ్, మ్యాచ్ ముగియడానికి 5 నిమిషాల ముందు ఆకాశ్‌దీప్ సింగ్ నాలుగో గోల్ చేశాడు. భారత్‌ 5 పెనాల్టీ కార్నర్‌లలో 3ని గోల్‌గా మల్చడం విశేషం. కాగా భారత జట్టు ఘనవిజయం సాధించిన తర్వాత ప్రేక్షకులంతో ఒక్కసారిగా నిలబడి చప్పట్లతో హర్ష ధ్వానాలు చేశారు. వందేమాతరం, మా తుఝే సలామ్‌ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. భారత ప్లేయర్లు కూడా అభిమానులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు బీసీసీఐ సెక్రెటరీ జైషా, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..