ICC World Cup 2023 New Schedule: డేట్ మారిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. మరో 8 మ్యాచ్‌లు కూడా.. వన్డే ప్రపంచ కప్ కొత్త షెడ్యూల్ ఇదే.. – Telugu News | India vs Pakistan clash among 9 odi World Cup 2023 fixtures rescheduled check new Schedule
India vs Pakistan: ఐసీసీ ప్రపంచ కప్ 2023 కొత్త షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 15 న జరగాల్సిన భారతదేశం-పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పుడు అక్టోబర్ 14 న జరగనుంది. కొత్త షెడ్యూల్లో మొత్తం 9 మ్యాచ్‌ల తేదీలు మార్చారు. ఇందులో పాకిస్థాన్ మ్యాచ్‌లు 3, భారత్ మ్యాచ్‌లు 2ఉన్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం భారత జట్టు అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్‌తో ఈ మ్యాచ్ నవంబర్ 11న జరగాల్సి ఉంది.
ICC World Cup 2023 New Schedule: ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ తేదీ మారింది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు ఒకరోజు ముందుగా అక్టోబర్ 14న జరగనుంది. భారత్-పాకిస్తాన్ మాత్రమే కాదు, మొత్తం 9 మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ మార్చింది. కొన్ని క్రికెట్ బోర్డులు షెడ్యూల్లో మార్పును కోరుకుంటున్నాయని, అందుకే షెడ్యూల్లో మార్పులు చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు. అయితే అక్టోబర్ 15 నుంచి అహ్మదాబాద్‌లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అదే రోజు భారత్-పాకిస్థాన్‌ల మధ్య హైప్రొఫైల్ మ్యాచ్ జరిగితే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.
కాగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ మాత్రమే మారలేదు. ఐసీసీ కొత్త షెడ్యూల్ ప్రకారం 9 మ్యాచ్‌ల తేదీలు మారాయి. ఇందులో భారత్‌తో 2 మ్యాచ్‌లు, పాకిస్థాన్‌తో 3 మ్యాచ్‌లు ఉన్నాయి.
Nine fixtures have been rescheduled for #CWC23.
Details 👇
— ICC Cricket World Cup (@cricketworldcup) August 9, 2023
భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌ల షెడ్యూల్లో మార్పు..
కొత్త షెడ్యూల్ ప్రకారం భారత జట్టు అక్టోబర్ 15న కాకుండా అక్టోబర్ 14న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్‌తో ఈ మ్యాచ్ నవంబర్ 11న జరగాల్సి ఉంది. ఇది కూడా మారింది.
పాకిస్థాన్ 3 మ్యాచ్‌లు మారాయి..
ప్రపంచకప్ కొత్త షెడ్యూల్లో పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల తేదీలు మారాయి. అక్టోబరు 12కి బదులుగా రెండు రోజుల ముందుగా అక్టోబర్ 10న శ్రీలంకతో పాక్ జట్టు ఆడనుంది. నవంబర్ 12న ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఇప్పుడు నవంబర్ 11న జరగనుంది. దీంతో పాటు అక్టోబర్ 14న పాకిస్థాన్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడనుంది.
ఇవి కాకుండా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పుడు అక్టోబర్ 12న పోటీపడనున్నాయి. నవంబర్ 11న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ ఢీకొంటుంది. అక్టోబర్ 15న ఇంగ్లండ్ ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ విధంగా మొత్తం 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చారు.
టీమ్ ఇండియా వరల్డ్ కప్ షెడ్యూల్..
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అక్టోబర్ 8 చెన్నై,
భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 11 ఢిల్లీ,
భారత్ వర్సెస్ పాకిస్థాన్ అక్టోబర్ 14 అహ్మదాబాద్,
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ అక్టోబర్ 19 పూణె,
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ అక్టోబర్ 22 ధర్మశాల,
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ అక్టోబర్ 29 లక్నో,
భారత్ వర్సెస్ శ్రీలంక, 2 నవంబర్, ముంబై,
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా , 5 నవంబర్, కోల్‌కతా,
భారత్ వర్సెస్ నెదర్లాండ్స్, 12 నవంబర్, బెంగళూరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..