Leading News Portal in Telugu

IND vs WI: ధోనిని చూసి నేర్చుకో..! స్వార్థపరుడంటూ హార్ధిక్‌పై నెటిజన్లు ఫైర్.. అసలేం జరిగిందంటే..? – Telugu News | ‘Selfish Player’: Internet Trolls Hardik Pandya for robbing Tilak Varma’s Chance To Complete Half Century


IND vs Wi 3rd T20I: వరుసగా రెండు టీ20లు ఓడి సిరీస్‌ని కోల్పోయే దశకు చేరిన భారత్‌ని మూడో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 83, తిలక్ వర్మ అజేయమైన 49 పరుగులు ఆదుకున్నాయి. అయితే మ్యాచ్ విజయానికి ఇంకా 2 పరుగులే అవసరమైన సమయంలో హార్దిక్ విన్నింగ్ సిక్సర్‌లో మ్యాచ్ గెలిపించాడు. ఇదే ఇప్పుడు హార్దిక్ పాలిన శాపమైంది. నెటిజన్లు, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా తెలుగు వాళ్లు..

IND vs WI: ధోనిని చూసి నేర్చుకో..! స్వార్థపరుడంటూ హార్ధిక్‌పై నెటిజన్లు ఫైర్.. అసలేం జరిగిందంటే..?

Netizens Reaction Over Hardik’s Winning Sixer

IND vs WI 3rd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు టీ20లు ఓడి సిరీస్‌ని కోల్పోయే దశకు చేరిన భారత్‌ని మూడో మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 83, తిలక్ వర్మ అజేయమైన 49 పరుగులు ఆదుకున్నాయి. అయితే మ్యాచ్ విజయానికి ఇంకా 2 పరుగులే అవసరమైన సమయంలో హార్దిక్ విన్నింగ్ సిక్సర్‌లో మ్యాచ్ గెలిపించాడు. ఇదే ఇప్పుడు హార్దిక్ పాలిన శాపమైంది. నెటిజన్లు, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా తెలుగు వాళ్లు హార్దిక్ పాండ్యా స్వార్థపరుడు, విష సర్పం అంటూ మండిపడుతున్నారు. అతను కొట్టిన సిక్సరే మ్యాచ్‌ని గెలిచింది కదా, మరి హార్దిక్‌ని ఎందుకు అలా తిడుతున్నారంటే.. అక్కడే ఉంది అసలు విషయం.

వెస్టిండీస్ టీమ్ ఇచ్చిన 160 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు భారత్ తరఫున వచ్చిన ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(1), శుభమాన్ గిల్(6) వెంటనే వెనుదిరిగారు. ఆ దశలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆటను మలుపు తిప్పారు. వరుస ఫోర్లు, భారీ సిక్సర్లతో మ్యాచ్‌‌ ఫలితాన్ని నిర్ధేశించారు. ఈ క్రమంలోనే సూర్య 83 పరుగుల వద్ద పెవిలియన్ చేరినా, తిలక్ వర్మ తనదైన ఆటతో మెప్పించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ 4వ సింగిల్ తీసిన తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో భారత్‌ విజయానికి 2 పరుగులు, తిలక్ లాంటి యువ ఆటగాడు హాఫ్ సెంచరీ చేయడానికి ఒక్క పరుగే అవసరం. అయితే క్రీజులోకి వచ్చిన హార్ధిక్ సింగిల్ తీసి, తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ హార్దిక్ అలా చేయకుండా 18వ ఓవర్ 5వ బంతిని సిక్సర్‌ బాదాడు. దీంతో భారత్ విజయం సాధించింది. అయితే తిలక్ వర్మ లాంటి అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని యువ ఆటగాళ్లకు వారు చేసే పరుగులు, హాఫ్ సెంచరీలే స్ఫూర్తి, అత్మవిశ్వాసం పెరిగేలా చేస్తాయనేది వాస్తవం. కానీ హార్దిక్ ఒక కెప్టెన్ హోదాలో ఆ విషయాన్ని ఆలోచించకుండా.. మ్యాచ్‌ని తానే గెలిపించాలని స్వార్థం చూపించాడంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

హార్దిక్ సిక్సర్ వీడియో.. 

ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ లాంటి దిగ్గజ కెప్టెన్ తనకు మ్యాచ్‌ని గెలిపించే అవకాశం వచ్చినా.. ఆ ఘనతకు కోహ్లీయే అర్హుడని భావించి, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కూడా డిఫెన్స్ ఆడాడని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈ మేరకు అనేక ట్వీట్లు, మీమ్స్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యాపై వస్తున్న ట్రోల్ మీమ్స్..