స్వాతంత్య్ర దినోత్సవం రోజు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. రిషబ్ పంత్ రీఎంట్రీకి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ టైంకి పంత్ ఫిట్‌గా ఉంటాడనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి సైతం చెప్పినట్లు సమాచారం.
కాగా, గతేడాది డిసెంబర్ 30న ఘోర రోడ్డు యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్.. ప్రస్తుతం 70 శాతం వరకు కోలుకుని, ఫిట్‌నెస్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అయితే, పంత్ ఇంకా ప్రాక్టీస్ ప్రారంభించకుండానే జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. పంత్ వేగంగా కోలుకునే విధానం చూస్తుంటే అనుకున్న సమయాని కంటే ముందే టీమిండియాలో జాయిన్ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మరోవైపు గాయం కారణంగా చాలాకాలంగా టీమ్ కు దూరంగా ఉన్న టీమిండియా స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో ఐర్లాండ్ తో జరిగే సిరీస్‌తో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాకు బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. మరో పక్క గాయాల బారిన పడి శస్త్ర చికిత్సలు తీసుకున్న.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు సైతం స్పీడ్ గా రికవరీ అవుతున్నారు. వీరిద్దరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశారు. ఆసియా కప్ నాటికి ఈ ఇద్దరు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు.